DC vs RR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్(IPL Play Offs) రేసు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో కీలక సమరానికి మరిన్ని నిమిషాల్లో తెరలేవనుంది. టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) నిలకడలేని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో అమీతుమీకి సిద్ధమైంది.
ఢిల్లీ గడ్డపై జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఢిల్లీ స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్రౌండర్ గుల్బదిన్ నయూబ్లను తీసుకుంది. మరోవైపు రాజస్థాన్ సైతం రెండు మార్పులు చేసింది.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డొనొవాన్ ఫెర్రెరియా, రొవ్మన్ పావెల్, శుభమ్ దూబే, ట్రెంట్ బౌల్ట్, యజ్వేంద్ర చాహల్, అశ్విన్. అవేశ్ ఖాన్, సందీప్ శర్మ,
ఢిల్లీ తుది జట్టు : జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, అభిషేక్ పొరెల్, షాయ్ హోప్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బదిన్ నయీబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.