Ravichandran Ashwin | వరల్డ్ నంబర్ 2ను రెండు సార్లు డకౌట్ చేసిన అశ్విన్
రెండో టెస్టులో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు రికార్డులు క్రియేట్ చేశాడు. వరల్డ్ నంబ్ 2 ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను రెండు సార్లు డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాపై 100 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు.
Ravichandran Ashwin : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు రికార్డులు క్రియేట్ చేశాడు. వరల్డ్ నంబ్ 2 ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను రెండు సార్లు డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్మిత్‌ను అశ్విన్ డకౌట్ చేశాడు. ఇంతకుముందు 2020లో మెల్బోర్న్ టెస్టులో అశ్విన్ బౌలింగ్‌లో స్మిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆసీస్‌పై 100 వికెట్లు
ఈ మ్యాచ్‌లో స్పిన్‌మాంత్రికుడు అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై 100 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసిన అశ్విన్ ఆ జట్టుపై వంద వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ సీనియర్ స్పిన్నర్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. దాంతో, ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. అశ్విన్ టెస్టుల్లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 31వ సారి. దాంతో, ఈ ఫార్మాట్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
రెండో టెస్టులో అశ్విన్ ఒకే ఓవర్లో కీలకమైన రెండు వికెట్లు తీశాడు. వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ మార్నస్ లబుషేన్ , వరల్డ్ నంబర్ 2 బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేశాడు. షమీ నాలుగు వికెట్లు, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 263 రన్స్‌కే ఆలౌట్ అయింది. నాగ్‌పూర్ టెస్టులో నెగ్గిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ ప్రారంభానికి ముందు అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు పెద్ద కసరత్తే చేసింది. అచ్చం అశ్విన్‌లా బౌలంగ్ చేసే బరోడా స్పిన్నర్ మహేశ్ పిథియాతో స్టీవ్ స్మిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. అయినా కూడా ఫలితం లేకపోయింది. కీలకమైన రెండో టెస్టులో అతను ఈ ఆఫ్ స్పిన్నర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

