DC vs RR : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అగ్రస్థానంపై కన్నేసింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న పరాగ్ బృందం ఈ సీజన్లో రికార్డు స్కోర్ బాదిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభం నుంచి అందుబాటులో లేని మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు.
పంజాబ్ కింగ్స్‌పై 264 రన్స్ కొట్టినా ఓటమి పాలైన ఢిల్లీ ఈసారి విజయాన్ని ఒడిసిపట్టాలనే కసితో ఉంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ జట్టుతో కలవడం తమకు లాభిస్తుందని కెప్టెన్ అక్షర్ పటేల్ భావిస్తున్నాడు. కుర్ర ఓపెనర్లు యశస్వీ, వైభవ్‌ల విధ్వంసంతో విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ భారీ స్కోర్‌తో ఢిల్లీకి సవాల్ విసరాలనుకుంటోంది.
🚨Toss update from Jaipur🚨@rajasthanroyals won the toss and elected to bat first against @DelhiCapitals
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC pic.twitter.com/JoeHuEGDPL
— IndianPremierLeague (@IPL) May 1, 2026
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనొవాన్ ఫెరీరా, జడేజా, శుభం దూబే, ఆర్చర్, బిష్ణోయ్, బర్గర్, బ్రిజేశ్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – ఆడమ్ మిల్నే, శనక, రవి సింగ్, యవ్ రాజ్ పుంజ, తుషార్ దేశ్‌పాండే.
ఢిల్లీ తుది జట్టు : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పథుమ్ నిశాంక, నితీశ్ రానా, సమీర్ రిజ్వీ, స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, అకీబ్ నబీ.