న్యూఢిల్లీ: భారత యువ రేసర్ జెహాన్ దారువాలా ఎఫ్ఐఏ ఫార్ములా-2 చాంపియన్షిప్లో పోడియం ఫినిష్ చేశాడు. అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన రేసులో శనివారం నాలుగో స్థానంలో నిలిచిన దారువాలా.. ఆదివారం మూడో స్థానం దక్కించుకున్నాడు. ఓవరాల్గా ఏడో ప్లేస్లో నిలిచి మెరుగైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు.