అజర్బైజాన్ విజేత పెరెజ్

న్యూఢిల్లీ: అత్యంత నాటకీయంగా సాగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ రేసర్ సెరిగో పెరెజ్ విజేతగా నిలిచాడు. అజర్బైజాన్ రాజధాని బకులో ఆదివారం జరిగిన రేస్‌లో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) కారు ప్రమాదానికి గురికావడంతో రెండు ల్యాప్‌ల షూటౌట్ నిర్వహించగా.. మెక్సికన్ డ్రైవర్ పెరెజ్ ముందుగా లక్ష్యాన్ని చేరి టైటిల్ సొంతం చేసుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఆస్టాన్ మార్టిన్), పెరీ గ్లాసీ (అల్ఫాతౌరీ) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. రేసు మరో నాలుగు ల్యాప్‌ల్లో ముగుస్తుందనే వరకు అందరి కంటే ముందు ఉన్న రెడ్‌బుల్ టాప్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కారు టైరు పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగింది. దీంతో అతడు అక్కడే ఆగిపోగా.. రేసు కూడా కాసేపు నిలిచింది. అనంతరం రెండు ల్యాప్‌ల షూటౌట్ నిర్వహించగా పెరెజ్ పైచేయి సాధించాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ చివరికి క్రాష్ వల్ల 15వ స్థానానికే పరిమితమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ajarbejan
- formula one
- perez
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

