DC vs RR | పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ లక్ష్యం రెండొందలపైనే..!
DC vs RR : సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(90) దుమ్మురేపాడు. ప్రతిమ్యాచ్‌లో శుభారంభమిస్తున్న ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(6), వైభవ్ సూర్యవంశీ (4)లు విఫలమైనా జట్టుకు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరందించాడు.
DC vs RR : సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(90) దుమ్మురేపాడు. ప్రతిమ్యాచ్‌లో శుభారంభమిస్తున్న ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(6), వైభవ్ సూర్యవంశీ (4)లు విఫలమైనా జట్టుకు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరందించాడు. ఎప్పటిలానే ధ్రువ్ జురెల్(42) తన విధ్వంసాన్ని కొనసాగించగా.. డెత్ ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా(47 నాటౌట్) పిడుగల్లే ఢిల్లీ బౌలర్లపై పడ్డాడు. చివరి మూడు ఓవర్లలో 52 రన్స్ పిండుకున్న ఫెరీరా ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకమ్యాడు.
పంతొమ్మిదో సీజన్లో బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారిన రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4) జోరుకు కైలీ జేమీసన్ బ్రేకులు వేశాడు. తొలి బంతినే బలంగా కొట్టి స్ట్రెయిట్ బౌండరీగా మలిచిన వైభవ్‌ను ఈ పొడగరి పేసర్ లో-ఫుల్‌టాస్‌తో బురిడీ కొట్టించాడు. బంతిని అడ్డుకునేందుకు వైభవ్ ప్రయత్నించినా.. వికెట్ కాపాడుకోలేకపోయాడు.
An in-swinging yorker 😲🔥
🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊
Wait for the celebration 👀
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3
— IndianPremierLeague (@IPL) May 1, 2026
అంతకుముందు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదిన యశస్వీ జైస్వాల్(6)ను ఫుల్‌టాస్‌తో స్టార్క్ ఔట్ చేసి తొలి వికెట్ సాధించాడు. వరస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రియాన్ పరాగ్(90), ధ్రువ్ జురెల్(42) నిర్మిస్తున్నారు. జట్టుకు భారీ స్కోరందించే బాధ్యత తీసుకున్న పరాగ్ 6వ ఓవర్లో 6, 4, 6 బాదడంతో స్కోర్ యాభై దాటింది.
శతక భాగస్వామ్యంతో
ఆదిలోనే రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టిన ఢిల్లీ బౌలర్లను పరాగ్, జురెల్ దంచేశారు. అక్షర్ పటేల్‌ను ఉతికేసిన పరాగ్ రెండు సిక్సర్లతో స్కోర్ బోర్డును ఉరికించాడు. అటాకింగ్ గేమ్‌తో ఈ ద్వయం మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పింది. అర్ధ శతకానికి చేరువైన జురెల్ ఔటవ్వడంతో102 రన్స్ సాధించిన ఈ జోడీ విడిదీశాడు. జడేజా(20)ను, సెంచరీకి దగ్గరైన పరాగ్‌ను స్కార్క్ ఔట్ చేసి మూడో వికెట్ సాధించాడు.
𝗙𝗶𝗲𝗿𝘆 𝗙𝗲𝗿𝗿𝗲𝗶𝗿𝗮 𝗳𝗶𝗻𝗶𝘀𝗵 yet again! 💥
🎥 Some glorious shot-making from him to power #RR 🤌
Scorecard ▶️ https://t.co/6OOjzHtrt5#TATAIPL | #KhelBindaas | #RRvDC | @rajasthanroyals pic.twitter.com/RIgUi0Kyd1
— IndianPremierLeague (@IPL) May 1, 2026
గత మ్యాచ్‌లో ఆర్సీబీపై చెలరేగిన ఫెరీరా(47 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్ వేసిన 18వ ఓవర్లో ఫెరీరా బంతిని మూడుసార్లు స్టాండ్స్‌లోకి పంపాడు. ఇన్నింగ్స్ ఇవరి ఓవర్లో నటరాజన్‌కు చుక్కలు చూపిస్తూ.. ఫెరీరా 4, 6, 4 కొట్టగా.. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

