Ons Jabeur | దుబాయ్ ఓపెన్ నుంచి వైదొలిగిన వరల్డ్ నంబర్ 3 జుబెర్
వరల్డ్ నంబర్ 3 క్రీడాకారిణి ఓన్స్ జుబెర్ దోహ, దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మైనర్ సర్జరీ కారణంగా తాను ఈ రెండు టోర్నమెంట్లలో ఆడడం లేదని ఆమె తెలిపింది.
Ons Jabeur : వరల్డ్ నంబర్ 3 క్రీడాకారిణి ఓన్స్ జుబెర్ దోహ, దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మైనర్ సర్జరీ కారణంగా తాను ఈ రెండు టోర్నమెంట్లలో ఆడడం లేదని ఆమె తెలిపింది. అయితే.. సర్జరీ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ‘కోర్టులో దిగి, రాణించడానికి ముందు మైనర్ సర్జరీ చేయించుకోవాలని నా వైద్య బృందం చెప్పింది. నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. దోహ, దుబాయ్ ఓపెన్ నుంచి వైదొలగడం నాకు బాధగానే ఉంది. ఈ టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్న మధ్య ఆసియాలోని అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. నేను పూర్తి ఆరోగ్యంగా, బలంగా అయ్యాక మీ అందరిని కలుస్తానిని మాట ఇస్తున్నా’ అని జుబెర్ తెలిపింది.
వింబుల్డన్ ఫైనలిస్ట్
ట్యునీషియాకు చెందిన జుబెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మర్కెట వొండ్రసోవ చేతిలో6-1, 5-7, 6-1తో ఓడి పోయింది. పోయిన ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో అద్భుతంగా ఆడింది. రెండింటిలోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఫైనల్లో ఓటమితో ట్రోఫీ చేజార్చుకుంది. దోహా ఓపెన్ ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరగనుంది. ఆ తర్వాత దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్షిప్స్ మొదలు కానున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

