William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
William O’Rourke: భారత జట్టుతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్ (Newzealand) జట్టును వరసగా గాయాలు వెంటడుతున్నాయి.కివీస్ కష్టాలను మరింత పెంచుతూ పేసర్ విలియం ఓరూర్కీ (William O’Rourke) కూడా అందుబాటులో లేడు.
William O’Rourke: భారత జట్టుతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్ (Newzealand) జట్టును వరసగా గాయాలు వెంటడుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రచిన్ రవీంద్ర ఆస్ప్రతి పాలవ్వగా.. తాజాగా మార్క్ చాప్మన్, జాక్ ఫోక్స్‌లు సైతం గాయపడ్డారు. కివీస్ కష్టాలను మరింత పెంచుతూ పేసర్ విలియం ఓరూర్కీ (William O’Rourke) కూడా అందుబాటులో లేడు. భారత్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లో కీలకం అవుతాడని రూర్కీపై భారీ ఆశలు పెట్టుకున్న బ్లాక్ క్యాప్స్ చివరకు అతడి సేవల్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లోపు రూర్కీ ఫిట్‌గా మారే అవకాశముంది.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వరసగా కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోతోంది. ఇప్పటికే ప్రకటన షూట్ సమయంలో రచిన్ రవీంద్ర గాయపడగా.. మార్క్ చాప్మన్, జాక్ ఫోక్స్ సైతం ఇంజూరీకి గురయ్యారు. దీంతో ఈ ఇద్దరూ భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం కానున్నారు. ఈ షాకింగ్ వార్త నుంచి తేరుకోకముందే పేసర్ విలియం ఓ రూర్కీ సైతం టీమిండియా సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. తొడ కండరాలు, కాలిపిక్క నొప్పితో బాధపడుతున్న రూర్కీ ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్నాడు.
News | Will O’Rourke will miss the upcoming tour against India as a precaution, as he continues rehabilitate injuries to his left hamstring and calf. Full story ➡️ https://t.co/WmzQmxq11V #NZvIND https://t.co/Wxr1gjLfx4
— BLACKCAPS (@BLACKCAPS) October 9, 2026
భారత్‌తో వన్డే, టెస్టుల్లో అతడిని ఆడించాలని న్యూజిలాండ్ క్రికెట్ భావించినా.. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకొని విశ్రాంతినిచ్చింది. ‘పటిష్టమైన టీమిండియాతో స్వదేశంలో జరుగనున్న వన్డే, టెస్టు సిరీస్‌కు రూర్కీ అందుబాటులో లేకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసింద’ని ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు.
అక్టోబర్ 22 నుంచి
అక్టోబర్ మూడో వారంలో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు. అక్టోబర్ 22 నుంచి శ్రేయాస్ అయ్యర్ సేన, కివీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆపై నవంబర్ 4వ నుంచి ఇరుజట్లు ఐదు వన్డేల్లో తలపడతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును టీమిండియా ఢీకొట్టనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

