Lovlina Borgohain Success trick | బాక్సర్ లవ్లీనా విజయ రహస్యం ఇదే!
Lovlina Borgohain Success trick | పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడడం అంటే.. కేవలం ఫిట్నెస్ ఒక్కటే సరిపోదు. ఆ టోర్నీలో ఉండే వత్తిడిని ఎదుర్కొనే మానసిక శక్తి చాలా అవసరం. బాక్సింగ్‌లో ఉండే సైకలాజికల్ అంశాలపై అవగాహన పెంచుకున్నట్లు ఓ సందర్భంలో లవ్లీనా తెలిపింది.

హైదరాబాద్: లవ్లీనా బోర్గోహెయిన్ ( Lovlina Borgohain )ఇప్పుడో సెన్షేషన్. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు ఓ మెడల్‌ను ఖాయం చేసిన బాక్సార్ ఆమె. ఆమె పుట్టింది అస్సాంలో. శాయ్‌లో శిక్షణ పొందింది. ఆమె ఎత్తు ఆమెకు అడ్వాంటేజ్. తన కెరీర్లో దూసుకువెళ్తున్న ఓ దశలో లవ్లీనాకు అనూహ్య ఓటమి ఎదురైంది. ఆ సమయంలో ఆమె ఖంగుతిన్నది. ఎందుకు ఇలా జరిగిందో అంచాన వేసింది. ఆ రూటును మార్చుకోవాలని భావించింది. తన పంచ్ అదరాలంటే.. మరో మార్గాన్ని ఎన్నుకోవాలనుకున్నది. బౌట్ మధ్యలో తన శక్తిని పెంచే పనిపై దృష్టిపెట్టింది. దానిలో భాగంగానే మెడిటేషన్ మార్గాన్ని ఎంచుకున్నది. ఆటలో గెలవాలంటే బలం ఒక్కటే కాదు.. శారీరక శక్తులను అదుపులో ఉంచే ధ్యానం కూడా ముఖ్యమన్న విషయాన్ని ఆమె గ్రహించింది.
నిజానికి కిక్ బాక్సింగ్‌తో ఆమె కెరీర్ మొదలైంది. తన అక్కలు ఆ క్రీడలో ఉన్న కారణంగా ఆమె మరో గేమ్ ఎంచుకోవాలనుకున్నది. అప్పుడు బాక్సింగ్‌పై ఆమెకు మక్కువ పెరిగింది. ఇక పంచ్‌లు ఇవ్వడం మొదలుపెట్టింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్స్‌లో లవ్లీనా ఓడింది. ఆ ఓటమితో ఖంగుతిన్న లవ్లీనా.. తన ఆటతీరును మార్చుకోవాలని భావించింది. అప్రోచ్ మార్చితే గెలుపు వశమవుతుందన్న భావనకు వచ్చిందామె. తన సామర్థ్యానికన్నా ఎక్కువే ప్రిపేరైనా.. ఆ బౌట్లో ఓటమి ఆమెను నిర్వీర్యపరిచింది. శారీరక శక్తి ఒక్కటే కాదు.. ఆ శక్తి తగిన ధ్యాన బలం అవసరమన్న సత్యాన్ని ఆమె గ్రహించింది. దాంతో ఆమె మెడిటేషన్‌ను కూడా ఓ పంచ్లా వాడింది.
పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడడం అంటే.. కేవలం ఫిట్నెస్ ఒక్కటే సరిపోదు. ఆ టోర్నీలో ఉండే వత్తిడిని ఎదుర్కొనే మానసిక శక్తి చాలా అవసరం. బాక్సింగ్‌లో ఉండే సైకలాజికల్ అంశాలపై అవగాహన పెంచుకున్నట్లు ఓ సందర్భంలో లవ్లీనా తెలిపింది. తన మానసిక స్థైర్యాన్ని పెంచుకునేందుకు ధ్యానాన్ని ఎంచుకున్నట్లు ఆమె చెప్పింది. ఇది ఎంతో ఉపకరించినట్లు ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది. బౌట్ మధ్యలో ధ్యానం చేయడం వల్ల.. ఆ మ్యాచ్‌లో వ్యూహాన్ని మార్చే శక్తి తనకు వచ్చినట్లు లవ్లీనా చెప్పింది. మెడిటేషన్‌ను ప్రారంభించిన తర్వాత తన సామర్థ్యం రెట్టింపు అయ్యిందని, అప్పటి నుంచి తన పంచ్ పవర్ కూడా మారినట్లు రైజింగ్ లవ్లీనా వెల్లడిచింది. మెడిటేషన్‌ను ఆటలో భాగం చేయడం ద్వారా.. వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచినట్లు ఆమె చెప్పింది. 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకాలను కైవసం చేసుకున్నది.
ఇవాళ టోక్యోలో 64-69 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఓడినా లవ్లీనాకు పతకం ఖాయం. దీంతో ఆమె టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

