DC vs RR : వీరబాదుడుతోబౌలర్ల భరతం పడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు డగౌట్ చేరారు. పంతొమ్మిదో సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మిచెల్ స్టార్క్ యశస్వీ జైస్వాల్(6)ను ఫుల్‌టాస్‌తో బోల్తా కొట్టించగా.. వైభవ్ సూర్యవంశీ(4)ని జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. డేంజరస్ వైభవ్‌ను ఔట్ చేసిన ఆనందంలో నేను సాధించాను అని గట్టిగా అరుస్తూ.. అతడిని చూస్తూ చప్పట్లు కొడుతూ వైల్డ్‌గా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో ఈ కుర్ర ఓపెనర్లు ఇద్దరూ తొలి రెండు ఓవర్లోనే పెవిలియన్ చేరడం ఇదే మొదటిసారి.
పంతొమ్మిదో సీజన్లో బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారిన రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4) జోరుకు కైలీ జేమీసన్ బ్రేకులు వేశాడు. తొలి బంతినే బలంగా కొట్టి స్ట్రెయిట్ బౌండరీగా మలిచిన వైభవ్‌ను ఈ పొడగరి పేసర్ లో ఫుల్‌టాస్‌తో బురిడీ కొట్టించాడు. బంతిని అడ్డుకునేందుకు వైభవ్ ప్రయత్నించినా.. వికెట్ కాపాడుకోలేకపోయాడు.
Welcome to #TATAIPL 2026, Mitchell Starc 💪
🎥 A strong response to being hit for a six first ball 🔥
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/jYWs4QtoBk
— IndianPremierLeague (@IPL) May 1, 2026
అంతకుముందు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదిన యశస్వీ జైస్వాల్(6)ను ఫుల్‌టాస్‌తో స్టార్క్ ఔట్ చేసి తొలి వికెట్ సాధించాడు. వరస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రియాన్ పరాగ్(25 నాటౌట్), ధ్రువ్ జురెల్(21 నాటౌట్) నిర్మిస్తున్నారు. జట్టుకు భారీ స్కోరందించే బాధ్యత తీసుకున్న పరాగ్ 6వ ఓవర్లో 6, 4, 6 బాదడంతో స్కోర్ యాభై దాటింది. పవర్ ప్లేలో రాజస్థాన్ 56 పరుగులు చేసింది.