సుజుకా(జపాన్): ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌లో ఇటలీ యువ రేసర్ కిమి అంటోనెలి దూకుడు కొనసాగుతున్నది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అంతరాయాల మధ్య సాగుతున్న ఫార్ములావన్‌లో శనివారం జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ రేసు జరిగింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో మెర్సిడెస్ డ్రైవర్ కిమీ అంటోనెలి 1:28:778సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి పోల్పొజిషన్ కైవసం చేసుకున్నాడు.
మెర్సిడెస్‌కే చెందిన జార్జ్ రస్సెల్(1:29:076సె), ఆస్కార్ పియా స్ట్రి(1:29:132సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్(6), వెర్స్టాపెన్(11) ఒకింత నిరాశపరిచారు. ఆదివారం సెంట్రల్ జపాన్‌లోని సుజుకా సర్యూట్‌లో ప్రధాన రేసు జరుగనుంది.