భారత పారా అథ్లెట్ నీరజ్ ఆత్మహత్య
భారత పారా అథ్లెటిక్స్‌లో తీవ్ర విషాదం. ఆసియా పారా గేమ్స్‌లో మూడు స్వర్ణ పతకాలతో అగ్ర అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న నీరజ్ యాదవ్ (42) విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
- ప్రేమ వైఫల్యం, మానసిక ఒత్తిడే కారణం!
- డోపింగ్ నిషేధంతో కుంగుబాటు
న్యూఢిల్లీ : భారత పారా అథ్లెటిక్స్‌లో తీవ్ర విషాదం. ఆసియా పారా గేమ్స్‌లో మూడు స్వర్ణ పతకాలతో అగ్ర అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న నీరజ్ యాదవ్ (42) విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని మౌజ్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి తన కారు పక్కనే స్పృహతప్పి పడివున్న అతడిని దవాఖానాకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డోపింగ్ నిషేధం వల్ల ఎదురైన మానసిక ఒత్తిడి, భార్యతో విభేదాలు, అలాగే ఒక మహిళతో ఉన్న సంబంధం ముగిసిపోవడమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణాలని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై ఢిల్లీలోని జాఫ్రాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అపస్మారక స్థితిలో ఉన్న నీరజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన మహిళ డిసెంబర్ 2025 నుంచి అతనితో తనకు స్నేహం ఉందని తెలిపింది. మంగళవారం ఆమె హర్యానాలోని సోనిపట్‌కు వెళ్లి నీరజ్‌ను కలిసి, ఇకపై తాను సంబంధం కొనసాగించలేనని స్పష్టం చేసింది. ఆ తర్వాత నీరజ్ తన కారులోనే ఆమెను ఢిల్లీలోని మౌజ్‌పూర్ వద్ద దింపాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో అనుమానం వచ్చిన ఆ మహిళ తిరిగి మెట్రో స్టేషన్ ఒకటో నంబర్ గేట్ వద్దకు వెళ్లగా నీరజ్ కారు పక్కనే రోడ్డుపై పడి ఉన్నాడు. వెంటనే ఆమె చికిత్స నిమిత్తం హస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకపోయింది.
డోపింగ్‌తో చేజారిన రూ. 3 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగం
నీరజ్‌కు భార్య, మూడేండ్ల కుమార్తె ఉన్నారు. అయితే భార్యతో విభేదాల కారణంగా అతడు తల్లితోనే ఉంటున్నాడు. 2023 ఆసియా పారా గేమ్స్ తర్వాత నీరజ్ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో నాడా అతడిపై నాలుగేళ్ల సస్పెన్షన్ విధించింది. ఈ కారణంగా ఆసియాడ్‌లో సాధించిన రెండు స్వర్ణ పతకాలను ఆసియా పారా ఒలింపిక్ కమిటీ రద్దు చేసిన తర్వాత తీవ్ర మానసిక, ఆర్థిక సమస్యలతో నరకాన్ని అనుభవించాడని భారత పారా అథ్లెటిక్స్ జట్టు ప్రధాన కోచ్ ఎస్. సత్యనారాయణ తెలిపాడు. అలాగే, హాంగ్జౌలో సాధించిన విజయాలకు గానూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నీరజ్‌కు రూ. 3 కోట్లకు పైగా నగదు బహుమతితో పాటు క్లాస్-1 (గ్రూప్-1) ఉద్యోగం రావాల్సి ఉంది.
కానీ, సస్పెన్షన్ కారణంగా అవన్నీ రద్దయ్యాయి.. ఈ నెల నగోయా ఆసియా పారా గేమ్స్ కోసం సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొంటానని నీరజ్ కోరినప్పటికీ, సస్పెన్షన్ కాలం మిగిలి ఉండటంతో అది సాధ్యపడదని తేల్చిచెప్పడంతో తను మరింత కుంగిపోయాడని కోచ్ సత్యనారాయణ తెలిపాడు. ఏడేండ్ల వయసులోనే పోలియో అనంతర పక్షవాతంతో వైకల్యం బారిన పడిన నీరజ్, మొదట వీల్‌చైర్ టెన్నిస్ ఆడి ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లోకి వచ్చాడు. ఎఫ్55 (కూర్చుని ఆడే పోటీలు ) విభాగంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

