Lords Balcony : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం బాల్కనీలో సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) చొక్కా విప్పేసి విజయగర్జన చేయడాన్ని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. నాట్‌వెస్ట్ ట్రోఫీ(NatWest Trophy) ఫైనల్లో ఆతిథ్య జట్టుపై ఘన విజయం అనంతరం అప్పటి టీమిండియా కెప్టెన్ దాదా.. వెరైటీగా తన జెర్సీ విప్పేసి గాల్లో తిప్పుతూ సంబురాలు చేసుకున్నాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ సీన్ మళ్లీ రిపీటైంది.
లార్డ్స్ స్టేడియంలో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇటీవలే భారత మహిళలు ఏకైక టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించగా.. ఈసారి భారత మిక్స్డ్ డిజబిలిటీ ఆటగాళ్లు ఇంగ్లండ్‌పై తడాఖా చూపించారు. భారీ విజయంతో ఆతిథ్య జట్టుకు షాకివ్వడమే కాకుండా.. మేటి కెప్టెన్ గంగూలీని అనుకరిస్తూ రచ్చరచ్చ చేశారు.
India’s Mixed Disability team celebrates its massive 118-run win over their English counterparts in a T20 match at the iconic Lord’s Cricket Ground by waving their shirts like Sourav Ganguly famously did way back in 2002!! @dcciofficial pic.twitter.com/gx0cDt9CUQ
— Gaurav Gupta (@toi_gauravG) August 19, 2026
బుధవారం జరిగిన చివరి టీ20లో 118 పరుగులతో ఇంగ్లండ్‌ను ఓడించింది టీమిండియా. అంతే.. గెలుపు సంబురాల్లో భాగంగా లార్డ్స్ బాల్కనీలో చేరిన భారత ఆటగాళ్లు.. గంగూలీ 24 ఏళ్లనాటి ఐకానిక్ సెలబ్రేషన్ చేసుకున్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(DDCI) ఈ వీడియో పంచుకుంది. 2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో విజయానంతరం అప్పటి కెప్టెన్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో తన జెర్సీ విప్పేసి.. అనంతరం జెర్సీని చేతిలో పట్టుకొని గాల్లో తిప్పుతూ హల్చల్ చేశాడు.