IND vs ENG 4th Test | నీకు నువ్వే తోపువి.. నువ్వు కాకుంటే ఇంకెవరూ కొట్టలేరు.. గిల్‌కు హెడ్‌కోచ్ మోటివేషన్
IND vs ENG 4th Test | రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్లు ఔట్ అయినా రెండు టెస్టుల అనుభవం కూడా లేని యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ రాంచీ టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
IND vs ENG 4th Test | ఇంగ్లండ్‌తో రాంచీ టెస్టులో భాగంగా ఆ జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 61 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్పిన్‌ను బాగా ఆడగలిగే రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్లు ఔట్ అయినా రెండు టెస్టుల అనుభవం కూడా లేని యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతులాడి 52 పరుగులు చేసిన గిల్.. నాలుగో రోజు బ్యాటింగ్‌కు రావడానికి ముందు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ తనలో స్ఫూర్తి నింపాడని చెప్పుకొచ్చాడు. అవే తనకు ఓ టానిక్‌లా పనిచేశాయని వెల్లడించాడు.
నాలుగో టెస్టులో గెలిచిన తర్వాత గిల్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెడుతూ.. ‘నీవు కాకుంటే ఇంకెవరు..? ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు..? – రాహుల్ ద్రావిడ్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక గిల్ మాట్లాడుతూ ఇవే వ్యాఖ్యలు చేశాడు. ద్రావిడ్ ఇచ్చిన మోటివేషన్‌తో తాను క్రీజులో పట్టుదలగా ఆడానని, అది తనకు ఓ టానిక్‌లా పనిచేసిందని తెలిపాడు.
ఇదిలాఉండగా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఈ ఫార్మాట్లో గిల్ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. కనీసం అర్థ సెంచరీ చేయడానికి అతడు నానా తంటాలు పడ్డాడు. హైదరాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. దీంతో వైజాగ్ టెస్టుకు ముందు ద్రావిడ్.. గిల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అతడు మళ్లీ పూర్వపు ఫామ్ అందుకునే విధంగా మోటివేట్ చేశాడు. ఈ టెస్టులో ఆడకుంటే టీమ్ లో ప్లేస్ కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీంతో గిల్ మేల్కున్నాడు. వైజాగ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన గిల్.. రాజ్‌కోట్ టెస్టులో 91 పరుగులు చేశాడు. తాజాగా కీలకమైన రాంచీ టెస్టులోనూ ఛేదనలో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

