IND vs AUS | ట్రావిస్ హెడ్‌ను తీసుకోకపోవడంపై ఆసీస్ మాజీలు ఏం అన్నారంటే..?
తొలి టెస్టుకు ట్రావిస్ హెడ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తుది జట్టులో హెడ్ లేకపోవడం తాను నమ్మలేక పోతున్నానని మాజీ ఓపెనర్ మాథ్యూ హేడేన్ అన్నాడు.
IND vs AUS : భారత్‌తో తొలి టెస్టుకు మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న హెడ్‌ను పక్కన బెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ పేసర్ ఛాడ్ సాయెర్స్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ ఓపెనర్ మాథ్యూ హేడేన్ సైతం తుది జట్టులో హెడ్ లేకపోవడం తాను నమ్మలేక పోతున్నానని అన్నాడు. ‘నేను నమ్మలేక పోతున్నా. అతను స్వదేశంలో చాలా అద్భుతంగా ఆడాడు. అలాంటిది అతడు తుది జట్టులో లేకపోవడంతో నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు’ అని అన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులో హెడ్ 90 పరుగులు చేశాడు. దాంతో, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో అతడికి చోటు ఖాయమని అనుకున్నారంతా.
రెన్ షా డకౌట్
గాయం కారణంగా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. దాంతో, మిడిలార్డర్లో అతని ప్లేస్‌లో రెన్ షా, హ్యాండ్స్కాంబ్లో ఒకరికి చోటు దక్కవచ్చని అంతా ఊహించారు. అయితే.. అశ్చర్యకరంగా ఇద్దరూ తుది జట్టుకి ఎంపికయ్యారు. దాంతో, వరల్డ్ నంబర్ 4 బ్యాటర్ ట్రావెస్ హెడ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అతని ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన రెన్ షా తొలి టెస్టులో డకౌట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. హ్యాండ్స్కాంబ్ (31), అలెక్స్ క్యారీతో కలిసి ఏడో వికెట్‌కు ఫిఫ్టీ రన్స్ జోడించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 47 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

