IND vs AUS : రెండో టెస్టులో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ పేసర్ షమీ , మాధ్యూ కుహ్నెమన్ బౌల్డ్ చేశాడు. దాంతో, ఆ జట్టు పదో వికెట్ కోల్పోయింది. హ్యాండ్స్కాంబ్ (72) నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. అతను 66 పరుగుల వద్ద జడేజా ఓవర్లో ఔట్ అయ్యేవాడు. కానీ, అది నో బాల్ కావడంతో హ్యాండ్స్కాంబ్ బతికిపోయాడు. మూడో సెషన్లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీని వెనక్కి పంపి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత షమీ చెలరేగాడు. అతను లయాన్, కుహ్నెమన్‌ను బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. షమీ 4 వికెట్లు పడగొట్టాడు. జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లు తీశారు.
కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను స్పిన్ స్పెషలిస్ట్ అయిన హ్యాండ్స్కాంబ్ ఆదుకున్నాడు.భారత స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 110 బంతుల్లో అను అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు హ్యాండ్స్కాంబ్ క్రీజులోకి వచ్చాడు. 168 వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్‌ను హ్యాండ్స్కాంబ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆదుకున్నారు. కమిన్స్‌తో కలిసి హ్యాండ్స్కాంబ్ ఏడో వికెట్‌కు 52 రన్స్ జోడించాడు.