ICC Test Rankings | బౌలింగ్ విభాగంలో అశ్విన్, అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో..
ICC Test rankings | ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్.. ఇప్పుడు అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు.
న్యూఢిల్లీ: ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్.. ఇప్పుడు అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్ నాలుగు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయాడు.
దాంతో అశ్విన్, అండర్సన్ ఇద్దరూ 859 ర్యాంకింగ్ పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అయితే, గత కొంతకాలంగా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్, అండర్సన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మధ్య పోటీ కొనసాగుతున్నది. భారత్‌తో రెండు, మూడో టెస్టులు ఆడకపోవడంతో వెనుకబడిన కమ్మిన్స్ ప్రస్తుతం 849 ర్యాంకింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వారానికి ఒకసారి ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ వారం కొత్త జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా బౌలర్ కాగీసో రబడా 807 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో విజృంభిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఆయన 9వ స్థానంలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

