హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ గెలుపు జోరు కొనసాగిస్తున్నది. స్ట్రీట్ సర్క్యూట్లో భాగంగా ఏమ్ఐసీలో రెండో వీకెండ్ రేసులో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. బ్లాక్‌బర్డ్స్ తరఫున అనందిత్రెడ్డి, నీల్జానీ, అఖిల్ రవీంద్ర, లోలా లోవిన్ఫోస్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్ప్రింట్ రేసులో హైదరాబాద్ రేసర్ అఖిల్ 1:32: 10సెకన్ల టాప్‌లో నిలువగా, ఫిచర్ రేసులో నా మనోళ్లు అగ్రస్థానంలో నిలిచారు.