న్యూఢిల్లీ : భారత హాకీ ఫార్వర్డ్ ముంతాజ్ ఖాన్ ఎఫ్ఐహెచ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ముంతాజ్ చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఆ టోర్నీలో ముంతాజ్ ఆరు మ్యాచ్‌లలో హ్యాట్రిక్ సహా ఎనిమిది గోల్స్ సాధించింది. టాప్ స్కోరర్లలో ఆమె మూడో స్థానంలో నిలిచింది.
ఒక్క నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మినహా ఆమె ప్రతి మ్యాచ్‌లోనూ గోల్స్ సాధించింది. ముంతాజ్ 32.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, చార్లొట్ ఎంగెల్బర్ట్(బెల్జియం) 29.9 పాయింట్లతో రెండో స్థానం, లూనా ఫోక్(నెదర్లాండ్స్) 16.9 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు.