Chennai Super Kings : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తదుపరి హెడ్‌కోచ్ ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) రాజీనామాతో.. అతడి వారసుడిగా పలువురి పేర్లు వినిపిస్తున్నా సీఎస్కే యాజమాన్యం మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) అందరికంటే ముందు వరుసలో ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయి. అయితే.. మాథ్యూ హెడెన్(Matthew Hayden) మాత్రం ధోనీకి కోచింగ్ పదవి వద్దే వద్దని అంటున్నాడు. అంతేకాదు భారత క్రికెటర్‌నే కోచ్‌గా తీసుకోవాలని సూచ్చిస్తున్నాడీ చెన్నై మాజీ ఓపెనర్.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ పదవిని చేపట్టేది ఎవరు? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడం లేదు. 18 ఏళ్లుగా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పేయగా.. తదుపరి కోచ్‌గా ఎంఎస్ ధోనీ, హేమంగ్ బదొని, ఇయాన్ మోర్గాన్, మైక్ హస్సీల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ.. తన ఓటు మాత్రం వీరికి వేయనంటున్నాడు మాథ్యూ హెడెన్. సీఎస్కే తదుపరి కోచ్‌గా ధోనీ వద్దని.. భారత మాజీ ఆటగాడైన దినేశ్ కార్తిక్(Dinesh Karthik) సరైనోడు అని హెడెన్ అంటున్నాడు.
“There are names that have been mentioned; one of them was Dinesh Karthik, who I think is probably ready to take on that kind of role. I think it’s important to have a local coach,” @HaydosTweets said.#IPL2027 #CSK https://t.co/pThfNitVJM
— Circle of Cricket (@circleofcricket) August 24, 2026
‘ఐపీఎల్ 20వ సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ పదవి భర్తీ చేయనుంది. నా దృష్టిలో దినేశ్ కార్తిక్ సీఎస్కే కోచ్‌గా సరిపోతాడు. ఎందుకంటే.. స్థానిక కోచ్‌లను నియమించడం చాలా ముఖ్యం. చాలా ఫ్రాంచైజీలు విదేశీ కోచ్‌లపై ఆసిక్తి చూపిస్తున్నాయి.కానీ, సీఎస్కేకు మాత్రం భారత కోచ్ అవసరం.
ముఖ్యంగా స్థానికుడు, చెన్నైకి చెందిన కార్తిక్ అయితే బెటర్. విదేశీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనీలు.. చెన్నైకి ఐదు ట్రోఫీలు అందించారు. కార్తిక్ విషయానికొస్తే.. ఆర్సీబీ వరసగా రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలకమయ్యాడు’ అని హెడెన్ పేర్కొన్నాడు. 2019లో సీఎస్కే తరఫున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇక కార్తిక్ .. ఆర్సీబీ మెంటర్‌గా కొనసాగుతున్నాడు.

పద్దెనిమిదేళ్లుగా సీఎస్కేకు కోచింగ్ ఇచ్చిన ఫ్లెమింగ్ ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో ఆటగాడిగా జట్టులో చేరాడు. 2009లో అతడు కోచింగ్ బృందంలో చేశాడు. 2016, 2017లో చెన్నై జట్టుపై నిషేధం కారణంగా.. అతడు పూణె జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. 2017లో పూణె జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లెమింగ్ హయాంలో చెన్నై జట్టు 11 సార్లు ఫైనల్స్ ఆడింది. 10 సార్లు ఐపీఎల్లో, ఓ సారి చాంపియన్స్ లీగ్‌లో ఫైనల్స్‌కు వెళ్లింది. మొత్తంగా ఆరు సార్లు జట్టు టైటిల్ గెలిచింది.