David Warner | అందర్నీ మిస్ కాబోతున్నా.. డేవిడ్ వార్నర్ భావోద్వేగం

హైదరాబాద్: హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ భావోద్వేగ సందేశాన్ని తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఐపీఎల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. ఈ సీజన్లో సరైన రీతిలో పర్ఫార్మ్ చేయలేదు. దీంతో అతన్ని తొలుత కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత మ్యాచుల్లో టీమ్‌కు కూడా ఎంపిక చేయలేదు. అయితే శుక్రవారం రాత్రి ఇన్‌స్టాలో చేసిన పోస్టులో హైదరాబాదీలను మిస్ కాబోతున్నట్లు వార్నర్ తెలిపాడు. అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నానని, మా జట్టు వంద శాతం పర్ఫార్మ్ చేయడానికి మీరే డ్రైవింగ్ ఫోర్స్ అని, మీరిచ్చిన సపోర్ట్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాని, ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా సాగిందని, నేను-నా కుటుంబం మిమ్మల్ని మిస్ కాబోతున్నట్లు వార్నర్ తెలిపాడు.
వార్నర్ ఈ సీజన్లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో 195 రన్స్ చేశాడు. వాటిల్లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో.. హైదరాబాద్ జట్టు ఈ ఏడాది సీజన్లో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నది. హైదరాబాద్ సన్‌రైజర్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో వార్నర్ ముందున్నాడు. సన్‌రైజర్స్ తరపున 4014 రన్స్ చేశాడు వార్నర్. 95 మ్యాచుల్లో 49.55 సగటుతో అతను ఆ రన్స్ చేశాడు. 2014లో హైదరాబాద్ జట్టులో చేరాడు. 2016లో వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

