స్కేటింగ్ కాంతిరేఖ
అక్క అడుగుజాడల్లో నడుస్తూ.. స్కేటింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆ చిన్నారి.. నాలుగేండ్ల ప్రాయంలోనే రింక్‌లో గాయపడింది. స్కేటింగ్ వద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టు పట్టి మరి మెరుగైన శిక్షణతో రాటుదేలింది.
- జాతీయస్థాయిలో రాణిస్తున్న హైదరాబాదీ
- ఆసియా గేమ్స్ ప్రాబబుల్స్‌కు ఎంపిక
అక్క అడుగుజాడల్లో నడుస్తూ.. స్కేటింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆ చిన్నారి.. నాలుగేండ్ల ప్రాయంలోనే రింక్‌లో గాయపడింది. స్కేటింగ్ వద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టు పట్టి మరి మెరుగైన శిక్షణతో రాటుదేలింది. ఆరేండ్ల వయసులో కాళ్లకు చక్రాలు తొడిగిన ఆ అమ్మాయి.. పదేండ్లుగా నిలకడైన ప్రదర్శనతో ఉత్తమ స్కేటర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల ప్రాబబుల్స్‌కు ఎంపికైన ఆ అమ్మాయే హైదరాబాద్‌కు చెందిన అనుపోజు కాంతి శ్రీ. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గడమే తన లక్ష్యమంటున్న కాంతి శ్రీతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
స్కేటింగ్‌పై ఆసక్తి ఎలా కలిగింది?
అక్క ఖ్యాతిశ్రీ కూడా స్కేటర్ కావడంతో.. చిన్నప్పటి నుంచి ఆమెతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లేదాన్ని. కాళ్లకు చక్రాలతో రివ్వున దూసుకెళ్తుంటే చాలా బాగా అనిపించేది. దీంతో నాకు కూడా స్కేటింగ్ నేర్పించండని పట్టుబట్టడంతో అమ్మనాన్నాలు ఒప్పుకున్నారు.
ఏ విభాగంలో పోటీ పడుతున్నారు?
ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇందులో సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్‌లో పోటీ పడుతున్నా. నిరుడు అహ్మదాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించా. అప్పుడు ఆర్టిస్టిక్ కపుల్ డ్యాన్స్‌లో మెడల్ వచ్చింది. దీంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది.
స్ఫూర్తి ఎవరు?
చిన్నప్పటి నుంచి అక్కను గమనిస్తూనే పెరిగా. 2018 ఆసియా చాంపియన్‌షిప్‌లో ఖ్యాతిశ్రీకి పతకం రావడంతో నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని దృఢంగా నిర్ణియంచుకున్నా.
ప్రస్తుతం ప్రాక్టీస్ ఎలా సాగుతున్నది?
చదువుతో పాటు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటే.. కఠోర సాధన అవసరం. అయితే అందుకు తగిన సమయం కేటాయించడం ఇబ్బందిగా మారింది. జింఖానా రింక్‌లో అనూప్ సార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నా. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా.
కుటుంబ నేపథ్యం?
అమ్మా నాన్న ఇద్దరూ ఆర్కిటెక్చర్లు. మాకోసం వారి కెరీర్‌ను పక్కనపెట్టి కష్టపడుతున్నారు. అక్క బెంగళూరులో ఉంటూ చదువుతో పాటు స్కేటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. టోర్నీల్లో పాల్గొనడం భారీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. స్పాన్సర్లు ముందుకు వచ్చి సహకరిస్తే మరిన్ని ఫలితాలు సాధిస్తా.
భవిష్యత్తు లక్ష్యాలేంటి?
ప్రస్తుతం ఆసియాగేమ్స్ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యా. దీని కోసం మూడు ట్రయ ల్స్ నిర్వహిస్తారు. బెంగళూరు, చండీగఢ్ వేదికగా ఇప్పటికి రెండు ట్రయల్స్ పూర్తయ్యాయి. వాటిలో మెరుగైన ప్రదర్శన కనబరిచా. ఈ నెల 24 నుంచి చండీగఢ్‌లో ఫైనల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందులో సత్తాచాటితే.. ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగనున్న భారత జట్టులో చోటు దక్కుతుంది. ప్రస్తుతం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నా. ముగ్గురు సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేస్తే.. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనడం తధ్యమే. అందుకే తీవ్రంగా శ్రమిస్తున్నా.
ఇప్పటి వరకు సాధించిన పతకాల గురించి?
జాతీయ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటి వరకు ఏడు పతకాలు సాధించా. ఆర్టిస్టిక్ కపుల్ డ్యాన్స్, సోలో డ్యాన్స్‌లోనే అవి సొంతమయ్యాయి.
స్వర్ణాలు?:46
రజతాలు:27
కాంస్యాలు:10
మొత్తం: 10 ఏండ్లలో 83 పతకాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

