మొనాకో: రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ దక్కించుకొని.. ఈ ఏడాది డ్రైవర్ చాంపియన్‌షిప్ పోటీలో మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. ఆదివారం ఇక్కడ జరిగిన మొనాకో రేస్ ఆసాంతం దుమ్మురేపిన మ్యాక్స్ రెండో స్థానంలో నిలిచిన కార్లోస్ సైన్జ్ (ఫెరారి) కన్నా ఎనిమిది సెకన్ల ముందు గమ్యాన్ని చేరాడు. మరోవైపు బ్రిటన్ దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ ఏడో స్థానానికి పరిమితమై.. చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయాడు. రేస్‌లో ల్యాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచాడు.