Crocodile Kills Footballer | ఫుట్‌బాలర్‌ను పొట్టనబెట్టుకున్న మొసలి.. కాల్పులు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న స్థానికులు
Crocodile Kills Footballer : అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న ఓ యువ ఫుట్‌బాలర్ (Young Footballer) జీవితం విషాదంగా ముగిసింది. ఈత కొట్టేందుకు నదిలోకి దిగిన అతను మొసలి దాడి(Crocodile Attack)లో ప్రాణాలు కోల్పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోస్టారికా(Costarica) లోని ఓ క్లబ్‌కు చెందిన జట్టుకు చెందిన అతడి పేరు... జీసస్ అల్బెర్టో లొపెజ్...
Crocodile Kills Footballer : అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న ఓ యువ ఫుట్‌బాలర్(Young Footballer) జీవితం విషాదంగా ముగిసింది. ఈత కొట్టేందుకు నదిలోకి దిగిన అతను మొసలి దాడి(Crocodile Attack)లో ప్రాణాలు కోల్పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోస్టారికా(Costarica) లోని ఓ క్లబ్‌కు చెందిన జట్టుకు చెందిన అతడి పేరు… జీసస్ అల్బెర్టో లొపెజ్ ఒర్టిజ్(Jesus Alberto Lopez Ortiz). అందరూ అతడిని ‘చుచో'(Chucho) అని ముద్దుగా పిలుస్తారు. స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన ఈ 29 ఏళ్ల ఫుట్‌బాలర్ అదే తన ఆఖరి రోజు అని అస్సలు ఊహించలేదు. ఈత కొడుతున్న అతడిని ఓ పెద్ద మొసలి చూసింది. గబాగబా వచ్చి అతడిని గట్టిగా పట్టుకుంది.
ఊహించని సంఘటనతో షాక్ తిన్న చుచో దాని నుంచి విడిపించుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ, మొసలి మాత్రం పట్టువిడలేదు. దాంతో చుచో మృతి చెందాడు. ఆ తర్వాత ఆ మొసలి అతడి మృతదేహాన్ని నోట కరచుకొని ఈదుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న ఆ ఫొటోలు చూసిన స్థానికులు కొందరు తుపాకులతో అక్కడికి వెళ్లారు. ఆ మొసలిని కాల్చి చంపి చుచో మృత దేహాన్ని బయటకు తీశారు.
ఫుట్‌బాలర్ చుచో

చుచో గత కొన్నాళ్లుగా డిపోర్టివో రియో కనస్ జట్టుకు ఆడుతున్నాడు. చుచో అకాల మరణం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ‘మా క్లబ్ ఆటగాడు జీసస్ అల్బెర్టో లొపెజ్ ఒర్టిజ్ మృతి చెందాడనే విషయాన్ని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని డిపోర్టివో రియో కనస్(Deportivo Río Cañas) క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఉజ్జల భవిష్యత్తు ఉన్న అతను చనిపోవడం అందర్నీ కలిచివేస్తోంది. ఈ కష్ట సమయంలో చుచో కుటుంబాన్ని ఆదుకునేందుకు డిపోర్టివో క్లబ్ డబ్బులు సేకరిస్తోంది. చుచోకు ఎనిమిది, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

