Stuart Broad | రిటైర్మెంట్ పలికినందుకు బాధ పడట్లేదు.. ఎందుకో తెలుసా..? : బ్రాడ్
Stuart Broad : అంతర్జాతీయ క్రికెట్(Intenational Cricket)కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ (Stuart Broad)తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్ నిర్ణయం పట్ల బాధ పడడం లేదని అన్నాడు. తనకెంతో ఇష్టమైన ఆట నుంచి తప్పుకునేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నానని బ్రాడ్ తెలిపాడు. 'బెన్ స్టోక్స్(Ben Stokes)కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే...
Stuart Broad : అంతర్జాతీయ క్రికెట్(Intenational Cricket)కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ (Stuart Broad)తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్ నిర్ణయం పట్ల బాధ పడడం లేదని అన్నాడు. తనకెంతో ఇష్టమైన ఆట నుంచి తప్పుకునేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నానని బ్రాడ్ తెలిపాడు. ‘బెన్ స్టోక్స్(Ben Stokes)కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే నా రిటైర్మెంట్ నిర్ణయం చెప్పాను. వీడ్కోలు గురించి నాకు ఒక్క సందేహం, ఇసుమంత బాధ కూడా లేదు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆఖరి మ్యాచ్ ఆడడం సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు.. నేను రిటైర్మెంట్ పలికిన తీరు ప్రత్యేకంగా అనిపించింది. మరో విషయం ఏంటంటే..? నేను ఎంతో ఇష్టపడిన ఆట నుంచి వైదొలగడానికి ఎప్పటి నుంచో సిద్దంగా ఉన్నా’ అని 37 ఏళ్ల బ్రాడ్ తెలిపాడు.
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరిగిన యాషెస్ (Ashes Series)ఐదో టెస్టుతో అతను ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. 41 ఏళ్లున్న జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ చెప్తాడనుకుంటే.. బ్రాడ్ ఆటకు అల్విదా చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. తన కెరీర్ చివరి మ్యాచ్‌లో ఈ స్టార్ పేసర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆఖరి మ్యాచ్‌లో సిక్స్, వికెట్ తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
యువరాజ్ సింగ్, బ్రాడ్

అంతేకాదు టెస్టుల్లో భారత జట్టుపై హ్యాట్రిక్ (Hat-trick) తీసిన మొదటి బౌలర్‌గా బ్రాడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరో విషయం ఏంటంటే..? టీ20 వరల్డ్ కప్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు సమర్పించుకున్న మొదటి బౌలర్ తనే. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ధాటికి బ్రాడ్ ఒకే ఓవర్లో ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు.

ఆస్ట్రేలియాపై 150 వికెట్ల ఫీట్ సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా బ్రాడ్ మరో రికార్డు నెలకొల్పాడు. అలాగే.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)ను అత్యధికంగా 18 సార్లు ఔట్ చేసి ఈ స్టార్ పేసర్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కీలకమైన చివరి యాషెస్ టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ 2-2తో సిరీస్ పంచుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

