నాటింగ్హమ్ : ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు సారథి బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన 35 ఏండ్ల స్టోక్స్.. తన 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు చెబుతూ.. నాటింగ్హమ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టే తన కెరీర్లో ఆఖరిదని తెలిపాడు. నాలుగో రోజు ఆట ప్రారంభం సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ తన నిర్ణయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇంగ్లండ్ 2019 లో గెలిచిన వన్డే ప్రపంచకప్‌తో పాటు 2022లో సాధించిన టీ20 వరల్డ్‌కప్ విజయాల్లో స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. 2022లో ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న అతడు.. ‘బజ్‌బాల్’ ఆటతీరుతో టెస్టులను రసవత్తరంగా మార్చాడు. నాలుగేండ్ల కెప్టెన్సీ కెరీర్లో ఇంగ్లిష్ జట్టుకు మరుపురాని విజయాలను అందించాడు.