Axar Patel : పొట్టి ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ (Axar Patel ) ఐపీఎల్‌లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhli Capitals) కలను సాకారం చేసేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడీ కెప్టెన్. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్.. ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’ (Impact Player Rule) నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని అంటున్నాడీ పొడగరి క్రికెటర్.
పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ సన్నద్ధత గురించి, జట్టులో తన పాత్ర గురించి అక్షర్ పటేల్ మాట్లాడాడు. గత సీజన్లో తాను తక్కువగా బౌలింగ్ చేయడానికి కారణం ఇంప్యాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా కాదని చెప్పిన ఢిల్లీ కెప్టెన్.. ఈ నిబంధన తనకు అస్సలు నచ్చదని అంటున్నాడు. ‘ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధన నాకు నచ్చదు. ఎందుకుంటే నేను ఆల్‌రౌండర్‌ను కాబట్టి. మొదట్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు పనికొస్తారని ఆల్రౌండర్లను తీసుకునేవారు. ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధన వచ్చాక స్పెషలిస్ట్ బ్యాటర్, బౌలర్‌ను మాత్రమే
Delhi Capitals skipper Axar Patel is not a big fan of the impact player rule #AxarPatel #DC #IPL #IndianCricket #CricketTwitter pic.twitter.com/Fr4D9S9upF
— InsideSport (@InsideSportIND) March 23, 2026
ఎంచుకుంటున్నారు. అలాంటప్పుడు ఆల్‌రౌండర్ల అవసరం ఏముంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే.. నేను ఒక ఆల్‌రౌండర్‌ను అయినందు వల్ల నాకు ఈ నియమం అంటే ఇష్టముండదు. అయితే.. నియమాలేమీ మనం పాటించడానికేగా. కానీ, వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌ను వ్యతిరేకిస్తాను’ అని అక్షర్ పటేల్ వెల్లడించాడు.
పద్దెనిమిదో సీజన్లో తాను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి తన వేలి గాయమే కారణమని అక్షర్ పటేల్ చెప్పాడు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో.. ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్‌ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా మానింది.
Question : The Impact player rule is locked in till 2027. What are your views on it?
Axar Patel : I don’t really like this rule since I’m myself an all-rounder! 😅
BAAPU being BAAPU 😂#IPL2026 pic.twitter.com/xnNG7kURdz
— CREX (@Crex_live) March 23, 2026
ఆ తర్వాత బౌలింగ్ చేయడం మొదలెట్టా. అంతే తప్ప ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల కాదు అని అక్షర్ పటేల్ స్పష్టతనిచ్చాడు. అయితే.. హెడ్‌కోచ్ హేమంగ్ బదాని మాత్రం ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనను సమర్ధించాడు. పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లో ఢీల్లీ జట్టు ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది.