Cricket Australia: విండీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసేది అతడే..!
Cricket Australia: వార్నర్ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారు..? అన్న ప్రశ్నకు సెలక్టర్లు సమాధానం చెప్పినా ఇది తాత్కాలికమా..? లేక దీర్ఘకాలం కొనసాగిస్తారా..? అన్నది మాత్రం స్పష్టత లేదు. కామెరూన్ గ్రీన్ ను కూడా టెస్టు జట్టులోకి తీసుకోగా అతడు నాలుగో స్థానంలో
Cricket Australia: స్వదేశంలో వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనున్న ఆస్ట్రేలియా.. రెండు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. జనవరి 17 నుంచి మొదలుకాబోయే ఈ సిరీస్‌లో ఆసీస్.. టెస్టులలో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలోనే ఆడనుంది. ఇటీవలే టెస్టులు, వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ టెస్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో ఆ జట్టు.. స్టీవ్ స్మిత్‌ను ప్రకటించింది. విండీస్‌తో సిరీస్‌లో ఓపెనర్ ఖవాజాకు తోడుగా స్మిత్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. స్మిత్ టెస్టు ఓపెనర్‌గానే గాక వన్డేలలో సారథిగా ఉండనున్నాడు.
వార్నర్ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారు..? అన్న ప్రశ్నకు సెలక్టర్లు సమాధానం చెప్పినా ఇది తాత్కాలికమా..? లేక దీర్ఘకాలం కొనసాగిస్తారా..? అన్నది మాత్రం స్పష్టత లేదు. కామెరూన్ గ్రీన్ ను కూడా టెస్టు జట్టులోకి తీసుకోగా అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మాథ్యూ రెన్షా కూడా ఆసీస్ జట్టులోకి వచ్చాడు. 13 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా టెస్టు జట్టు కింది విధంగా ఉంది.
విండీస్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
Time to welcome the Windies.
Matt Renshaw returns to our men’s national squad, with Cam Green named a certain starter for the first Test in Adelaide. pic.twitter.com/cdprTbiiyE
— Cricket Australia (@CricketAus) January 10, 2024
వన్డేలకు.. : స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లాన్స్ మోరీస్, జై రిచర్డ్సన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా
సిరీస్ షెడ్యూల్:
– ఫస్ట్ టెస్ట్ : జనవరి 17-21 (అడిలైడ్ ఓవల్)
– సెకండ్ టెస్ట్ : జనవరి 25-29 (గబ్బా)
– ఫిబ్రవరి 2న తొలి వన్డే (మెల్బోర్న్)
– 4న రెండో వన్డే (సిడ్నీ)
– 6న మూడో వన్డే (కాన్బెర్రా)
– ఫిబ్రవరి 9న తొలి టీ20 (హోబర్ట్)
– 11న రెండో టీ20 (అడిలైడ్)
– 12న మూడో టీ20 (పెర్త్)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

