Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Neeraj Yadav: ఏషియన్ గేమ్స్‌లో మూడుసార్లు స్వర్ణపతకాలు గెలుచుకున్న పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 42 ఏళ్ల ఆ అథ్లెట్ ఎఫ్55 కేటగిరీలో రెండుసార్లు ఏషియన్ గేమ్స్‌లో పోటీపడ్డారు. జావెలిన్, డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్స్ గెలిచాడు.
న్యూఢిల్లీ: ఏషియన్ గేమ్స్‌లో మూడుసార్లు స్వర్ణపతకాలు గెలుచుకున్న పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (Neeraj Yadav)ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి అతని ఫ్లాట్‌లో సూసైడ్ జరిగింది. 42 ఏళ్ల ఆ అథ్లెట్ ఎఫ్55 కేటగిరీలో పలుమార్లు పోటీపడ్డారు. బహుశా విషం తాగి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. ఏ కారణం వల్ల చనిపోయాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీరజ్ యాదవ్ మృతిచెందినట్లు భారతీయ పారా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ ఎస్ సత్యనారాయన కన్ఫర్మ్ చేశారు.
జపాన్‌లోని నగోయాలో తాగాగా ముగిసిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనలేదన్న బాధతో అతను సూసైడ్ చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే డోపింగ్‌లో దొరకడం వల్ల ఇటీవల అతనిపై సస్పెన్షన్ విధించారు. దీంతో అతను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. డోపింగ్ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో అవకాశాలు సన్నగిల్లినట్లు భావించిన అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
నీరజ్ యాదవ్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్. పారా అథ్లెట్లలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఏడేళ్ల వయసులో అతనికి పోస్ట్ పోలియో పెరాలసిస్ వ్యాధి సోకింది. 2005 నుంచి 2021 వరకు వీల్‌చైర్ టెన్నిస్ ఆడాడు. 2015 ఢిల్లీ రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్లో అతను షాట్‌పుట్, జావెలిన్, డిస్కస్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు గెలిచాడు. అక్కడ నుంచి అతని దశ తిరిగింది. 2018లో జకర్తాలో జరిగిన ఏషియన్ పారా గేమ్స్‌లో మెన్స్ ఎఫ్55 జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచాడు. 29.84 మీటర్ల దూరం విసిరి ఆసియా రికార్డు స్థాపించాడు. ఇక 2023లో హాంగ్జూలో జరిగిన ఏషియన్ పారా గేమ్స్‌లో అతను రెండు స్వర్ణాలను గెలిచాడు. జావెలిన్, డిస్కస్ ఈవెంట్లలో అతను ఆ మెడల్స్ కొట్టాడు.
అక్టోబర్ 2023లో బెంగుళూరులో సేకరించిన శ్యాంపిల్ ఆధారంగా అతను డోపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. స్టానోజోలోల్ పరీక్షలో అతను పాజిటివ్‌గా వచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
Cyclone Arnab | తీరం దాటిన అర్నబ్ తుపాను.. తీవ్ర తుపానుగా మరికొన్ని గంటలు..!
TTD | శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ ఘటన..బాధ్యులపై కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

