Andy Murray | ఆస్ట్రేలియన్ ఓపెన్ మారథాన్ మ్యాచ్‌లో ముర్రే విజయం
ఆస్ట్రేలియాకు చెందిన థనసిపై గెలిచి మూడో రౌండ్‌కు ముర్రే
Andy Murray : బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో అతను ఆస్ట్రేలియాకు చెందిన థనసి కొక్కినకిస్ను ఓడించాడు. 5 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో ముర్రే విజేతగా నిలిచాడు. 4-6, 6-7(4-7), 7-6(7-5), 6-3, 7-5తో థనసిను చిత్తు చేశాడు. ముర్రే కెరీర్లో ఇది సుదీర్ఘ మ్యాచ్. మెల్బోర్న్ కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 4ః05 గంటలకు ముగిసింది. మ్యాచ్ గెలవడం నమ్మశక్యంగా అనిపించడం లేదు అని మ్యాచ్ అనంతరం ముర్రే వ్యాఖ్యానించాడు. ముర్రే ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్.
గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యంత ఆలస్యంగా ముగిసిన రెండో మ్యాచ్ ఇది. 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ మాజీ వరల్డ్ నంబర్ వన్ లిటన్ హెవిట్, సైప్రస్‌కు చెందిన మర్కోస్ బాఘ్దాటిస్ మధ్య జరిగిన మ్యాచ్ ఉదయం 4ః34కు ముగిసింది. ఈ మ్యాచ్‌లో హెవిట్ 4-6, 7-5, 7-5, 6-7 (4), 6-3తో విజయం సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

