న్యూఢిల్లీ: రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో నెదర్లాండ్స్‌కు చెందిన యువ డ్రైవర్ మృతిచెందాడు. బెల్జియంలో జరిగిన ఈ దుర్ఘటనలో 18 ఏండ్ల మోటార్‌స్పోర్ట్ డ్రైవర్ డిలానో వాంట్ హాఫ్ తీవ్ర గాయాలపాలై ట్రాక్‌పైనే కన్నుమూశాడు. బెల్జియం రిజినల్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదకర మలుపు వద్ద డిలానో కారు అదుపుతప్పగా.. అదే సమయంలో ట్రాక్‌పై దూసుకెళ్తున్న కార్లు అతడి వాహనాన్ని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.