IPL 2024: ఫైనల్ ఓవర్లో 26 రన్స్.. 3 డ్రాప్ క్యాచ్‌లు.. 2 రన్స్ తేడాతో ఓటమి.. వీడియో
IPL 2024: ఫైనల్ ఓవర్లో 29 రన్స్ కొట్టాలి. అయితే పంజాబ్ బ్యాటర్స్ ఆ టార్గెట్‌కు దాదాపు రీచ్ అయ్యారు. 26 రన్స్ చేశారు. ఆ హై డ్రామా ఓవర్లో మూడు డ్రాప్ క్యాచ్‌లు కూడా ఉన్నాయి. కేవలం రెండు రన్స్ తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది.
ముల్లాన్‌పూర్: పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం జరిగిన ఐపీఎల్(IPL 2024) మ్యాచ్‌లో ఫుల్ టెన్షన్ క్రియేట్ చేసింది. రెండు పరుగుల తేడాతో ఓడిన పంజాబ్.. దాదాపు విక్టరీకి చేరువైంది. 183 టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. చివరి ఓవర్లో విజయం కోసం 29 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఫైనల్ ఓవర్‌ను జయదేవ్ ఉనద్కత్ వేశాడు. ఇక ఆ ఓవర్లో జరిగిన డ్రామా అంతా ఇంతా కాదు. ఐపీఎల్ లవర్స్‌ను తెగ అట్రాక్ట్ చేసింది ఆ ఓవర్. నిజానికి ఫైనల్ ఓవర్లో, అది కూడా చేజింగ్‌లో 29 రన్స్ కొట్టడం కష్టమే. కానీ పంజాబ్ బ్యాటర్స్ మాత్రం విరోచిత హిట్టింగ్తో ఆకట్టుకున్నారు.
ఉనద్కత్ తొలి రెండు బంతుల్లోనే 14 రన్స్ సమర్పించుకున్నాడు. తొలి బంతిని అశుతోష్ సిక్సర్‌గా మలిచాడు. కానీ బౌండరీ లైన్ వద్ద ఆ బంతికి క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సు మిస్సైంది. ఫీల్డర్ చేతుల్లో పడ్డ బాల్.. బౌండరీ రోప్ దాటేసింది. ఆ తర్వాత ఉనద్కత్ రెండు వైడ్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత మరో సిక్సర్ కొట్టాడు అశుతోష్. అయితే అది కూడా దాదాపు క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సు మిస్సైంది. రెండు సిక్సర్లు కొట్టి జోరుమీదున్న అశుతోష్.. ఆ తర్వాత రెండు సార్లు రెండేసి రన్స్ తీసుకున్నాడు.
ఆ తర్వాత ఓ వైడ్ బాల్, సింగిల్ తీసుకోవడంతో శషాంక్ సింగ్ బ్యాటింగ్ క్రీజ్‌లోకి వచ్చేశాడు. సన్‌రైజర్స్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఓ క్యాచ్ మిస్ చేశాడు. ఫైనల్ బంతికి 9 రన్స్ అవసరం కాగా, పంజాబ్ బ్యాటర్ ఆ బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో పంజాబ్ రెండు రన్స్ తేడాతో ఓటమి పాలైంది. శషాంక్, అశుతోష్‌లు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను దాదాపు విక్టరీ తీరానికి చేర్చారు. ఆ బ్యాటర్ల హిట్టింగ్‌కు చెందిన వీడియో ఇదే.
A Fantastic Finish 🔥
Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛
Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌
Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI
— IndianPremierLeague (@IPL) April 9, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

