చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ రెడ్మీ నోట్ 10 సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. రెడ్మీ నోట్ 10S, రెడ్మీ స్మార్ట్వాచ్లను కంపెనీ ఇవాళ విడుదల చేసింది. నోట్ 10 సిరీస్లో ఇప్పటికే రెడ్మీ నోట్10, రెడ్మీ నోట్ 10 ప్రొ, రెడ్మీ నోట్ 10 ప్రొ మాక్స్ ఉన్నాయి.
64 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ హీలియో జీ95 చిప్సెట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నోట్ 10 ఎస్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 15,999గా ఉంది.
ఈ ఫోన్ డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ కలర్లలో లభిస్తుంది. మే 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ డాట్కామ్, ఎంఐ హోమ్, అమెజాన్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రెడ్మీ వాచ్ ధర రూ. 3,999 కాగా, ఫస్ట్ సేల్ మే 25న ఎంఐ డాట్కామ్, ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. వాచ్ 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇందులో 11 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి.
The New player in town comes loaded with:
— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) May 13, 2021
✅64MP Quad Camera Array
✅ MediaTek Helio G95
with HyperEngine Game Technology
✅5000mAh high-capacity battery
✅33W superfast charging
✅ 16.33cm Super AMOLED Display
✅MIUI 12.5
Rt if you want the #RedmiNote10S NOW!!🥵❤️ pic.twitter.com/WuD8GPmGGI
And it’s time for the much-awaited news *drumrolls*. The all-new #RedmiWatch goes out on sale on 2⃣5⃣th May at 1⃣2⃣ noon on https://t.co/cwYEXdVQIo and Flipkart. ⏰
— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) May 13, 2021
So get ready to #WearYourVibe soon. pic.twitter.com/k2F6B5J4b2