Apple Event | మార్చి 8 న యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ ఎస్ఈ3తో పాటు లాంచ్ అయ్యే ప్రొడక్ట్స్ ఇవే..
ఈ ఈవెంట్లో లాంచ్ కాబోయే ఐపాడ్ ఎయిర్ కూడా 5జీ కనెక్టివిటీతో పాటు ఏ15 బయోనిక్ ఎస్వోసీ ప్రాసెసర్‌తో నడవనుంది.
Apple Event | యాపిల్ ఈవెంట్ మార్చి 8న జరగనుంది. ఈ ఈవెంట్లో యాపిల్.. న్యూ మాక్‌బుక్ ప్రో, మాక్‌బుక్ ఎయిర్, మాక్ మినీ, ఐపాడ్ ఎయిర్, ఐమాక్ ప్రో(యాపిల్ ఎం1, ఎం2 సిలికాన్), ఐఫోన్ ఎస్ 3 ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.
భారత కాలమానం ప్రకారం మార్చి 8న రాత్రి 11.30కు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. కంపెనీ హెడ్ ఆఫీస్ యాపిల్ పార్క్ నుంచి యాపిల్ టీవీ యాప్, కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈవెంట్ లైవ్‌స్ట్రీమ్ కానుంది. అలాగే.. యాపిల్ అఫిషియల్ యూట్యూబ్ చానెల్లోనూ ఈవెంట్‌ను లైవ్ చేయనున్నారు.
గత సంవత్సరం రిలీజ్ అయిన మాక్ బుక్ ప్రో లాగానే.. ఈవెంట్లో రిలీజ్ అయ్యే మాక్‌బుక్ ఎయిర్ ఉండనుంది. కాకపోతే ఈసారి కలర్‌ఫుల్ డిజైన్, మిని ఎల్ఈడీ డిస్ప్లేతో మాక్‌బుక్ ఎయిర్ రానుంది.
ఇక.. చాలామంది ఈ ఈవెంట్ కోసం వెయిట్ చేసేది.. ఐఫోన్ ఎస్ఈ 3 కోసం. దీన్నే ఐఫోన్ ఎస్ఈ(2022)గా పిలుస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ ప్లస్ 5జీ, ఐఫోన్ ఎస్ఈ 5జీ ఫోన్‌గానూ దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
2020లో రిలీజ్ అయిన ఐఫోన్ ఎస్ఈ 2020 ఫీచర్లతో పాటు.. అదనంగా 5జీ సపోర్ట్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఏ15 బయోనిక్ ఎస్వోసీ, బెటర్ రేర్ కెమెరాతో రానున్న ఈ ఫోన్‌ను తక్కువ ధరకే అందించనున్నారు. సుమారు రూ.22,700కే యాపిల్ ఈ ఫోన్‌ను అందించనున్నట్టు తెలుస్తోంది.
Peek performance. March 8th. See you there. #AppleEvent pic.twitter.com/cEKMq7BuBh
— Greg Joswiak (@gregjoz) March 2, 2022
ఈ ఈవెంట్లో లాంచ్ కాబోయే ఐపాడ్ ఎయిర్ కూడా 5జీ కనెక్టివిటీతో పాటు ఏ15 బయోనిక్ ఎస్వోసీ ప్రాసెసర్‌తో నడవనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

