Vinaro Bhagyamu Vishnu Katha Review | వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ
Vinaro Bhagyamu Vishnu Katha Review, | ఫస్ట్ టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
Vinaro Bhagyamu Vishnu Katha Review | నటీనటులు : కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి, మురళీ శర్మ, కేజీఎఫ్ లక్ష్మణ్, శుభలేక సుధాకర్, ప్రవీణ్, శరత్ లోహితస్వ, పమ్మి సాయి తదితరులు; సాంకేతిక నిపుణులు : సంగీతం : చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ : డేనియల్ విశ్వాస్, బ్యానర్ జీఏ2 పిక్చర్స్, సమర్పణ : అల్లు అరవింద్, నిర్మాత : బన్నీ వాసు, రచన దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు.
చిన్న చిత్రాలకు ప్రీ రిలీజ్ క్రేజ్ రావడం అరుదు. టీజర్, ట్రైలర్, పాటలు బాగుంటునే అలాంటి ఇంప్రెషన్ పడుతుంది. ఇలా ఫస్ట్ టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
తిరుపతి నేపథ్యంగా సాగే కథ ఇది. ఇక్కడ అవసరంలో ఉన్న వారికి సాయం చేసే యువకుడు విష్ణు (కిరణ్ అబ్బవరం). లైబ్రేరియన్ గా ఉద్యోగం చేస్తుంటాడు. తల్లిదండ్రులు లేని అతను తాత (శుభలేక సుధాకర్) దగ్గర పెరుగుతాడు. జగమంత కుటుంబం నాది అనుకోవాలని తాత తన చిన్నప్పుడు చెప్పిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు విష్ణు. యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేసే దర్శన (కశ్మీర పరదేశి) నైబర్ నెంబర్ కాన్సెప్ట్ తో విష్ణుకు పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇదే క్రమంలో శర్మ (మురళీశర్మ) కూడా పరిచయం అవుతాడు. వీళ్లు ముగ్గురు కలిసి సరదాగా వీడియోలు చేస్తుంటారు. పాపులర్ అవ్వాలంటే వైరల్ వీడియోస్ చేయాలని, లైవ్ మర్డర్ కాన్సెప్ట్ కోసం డమ్మీ తుపాకీతో శర్మను కాలుస్తుంది దర్శన. ఈ ప్రయత్నంలో నిజమైన తూటా తగిలి శర్మ మరణిస్తాడు. ఈ ఘటన చూసి విష్ణు షాక్ అవుతాడు. దర్శన డమ్మీ గన్ స్థానంలో నిజమైన తుపాకీ ఎలా వచ్చింది. ఈ హత్య కేసు నుంచి దర్శనను హీరో ఎలా కాపాడాడు. ఈ కేసుకు గ్యాంగ్ స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ), రాజకీయ నాయకుడు (కేజీఎఫ్ లక్కీ లక్ష్మణ్)కు ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
స్టార్ హీరో సినిమాలకు సాధారణ కథలు చాలు. వాటినే పక్కా మాస్ ఎంటర్ టైనర్స్ అంటూ తెరపైకి తీసుకొస్తారు. కానీ చిన్న చిత్రాలను కొత్త కొత్త కాన్సెప్ట్ లే బతికిస్తాయి. నూతన దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ చిత్రంలో అలాంటి ప్రయత్నమే చేశారు. నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్ ను ఎంచుకుని దాని చుట్టూ లవ్, యాక్షన్, థ్రిల్లర్ కథను రాసుకున్నారు. దీనికి ఎంటర్ టైన్ మెంట్, మంచి మ్యూజిక్ జోడించడంతో సినిమా ఆహ్లాదకరంగా మారింది. గ్యాంగ్ స్టర్ కు హీరో తన కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. హీరో పొరుగువారికి సాయం చేయడం అనేది మనం గతంలో చూసినా…కథనంలో ఒక ఫ్రెష్ నెస్ కనిపిస్తూ ఉంటుంది. తిరుపతి నగర నేపథ్యం కూడా ఈ కొత్తదనంలో భాగమైంది. ప్రథమార్థంలో కొన్ని సీన్స్ హీరో ఎలివేషన్ కోసం వాడుకున్నా…కశ్మీర, మురళీ శర్మ పాత్రల అరంగేట్రంతో కథ గాడిలో పడుతుంది. ఇక ఇందులో అన్ని పాత్రలూ భాగమవుతాయి. విరామం వరకు కొంత రొటీన్ గా సాగే కథ ఇంటర్వెల్ లో వచ్చిన మలుపుతో ఆసక్తికరంగా మారుతుంది.
శర్మ హత్యకు కారణం ఎవరని తెలుసుకోవడం, దర్శనను హత్య కేసు నుంచి బయటపడేసేందుకు విష్ణు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం కథలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నాయిక తండ్రికి, అతని స్నేహితుడైన మురళీ శర్మకు గతంలో ఉన్న ప్లాష్ బ్యాక్ కూడా కథలోని మలుపులకు బలాన్నిస్తుంది. అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు, కథ కదలక వచ్చే మాంటేజ్ షాట్స్ ఉన్నా..ఓవరాల్ గా సినిమా మెప్పిస్తుంది. విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. అయినా మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే అతని ఆరాటం ఇందులోనూ కనిపించింది. ప్రథమార్థం ఫైట్స్ ఇందుకు ఉదాహారణ. కనీసం హీరో కండలైనా పెంచితే ఆ ఫైట్స్ కు జస్టిఫికేషన్ ఉండేది. ఇతను నిజంగానే వీళ్లను కొడుతున్నాడు అనిపించేది. కశ్మీర బబ్లీగా ఆకట్టుకుంది. ఎమోషనల్ గానూ నటించి ప్రతిభ చూపించింది. మురళీ శర్మ నటనానుభవానికి శర్మ పాత్ర ఒక నిదర్శనం. హీరోయిన్ తో అతను చేసే రీల్స్ సీన్స్ అన్నీ నవ్వించాయి. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. మొత్తానికి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఉన్న స్పేస్ ను ఈ సినిమా బాగానే ఫిల్ చేసేలా కనిపిస్తున్నది.
ప్లస్ పాయింట్స్
+ కొత్త కాన్సెప్ట్
+ ఆకట్టుకునే మలుపులు
+ కిరణ్ అబ్బవరం, కశ్మీర నటన
+ పాటలు, డైలాగ్స్
మైనస్ పాయింట్స్
– స్లో టేకాఫ్
– కొన్ని సాగతీత సీన్స్
చివరగా…కొత్త కాన్సెప్ట్ విష్ణు కథ
రేటింగ్ 2.75/5
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

