ICMR-NIMR Recruitment 2023 | ప్రాజెక్ట్ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్ (Statistical Assistant), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఎల్డీసీ (Lower Division Clerk) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎంఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్/ 12వ తరగతి, పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 61
పోస్టులు : ప్రాజెక్ట్ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎడీసీ తదితరాలు
అర్హతలు : ఇంటర్మీడియట్, 12వ తరగతి, పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.16000 నుంచి రూ.31000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 10 నుంచి 12, 18, 21, 24, 27 తేదీల వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి 11 వరకు
వెబ్సైట్ : nimr.org.in