20 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఐసెట్ వెబ్‌కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నది. ఈ సారి రెండు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఐసెట్ వెబ్‌కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నది. ఈ సారి రెండు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు బుధవారం విడుదల చేశారు.
మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈ నెల 20న ప్రారంభమయ్యి.. సెప్టెంబర్ 5తో ముగుస్తుంది. తుది విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8న ప్రారంభమై, 16తో ముగుస్తుంది. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, పూర్తి నోటిఫికేషన్ కోసం విద్యార్థులు https://tgicet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

