TCS ION: ఉపాధి నైపుణ్యాలతో సులువుగా ఉద్యోగం.. యువతలో స్కిల్స్ మెరుగుకు టీసీఎస్ కొత్త ప్రోగ్రామ్
TCS ION: ఏ ఉద్యోగం చేయాలన్నా సరైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. కానీ ఈ రోజుల్లో ఉద్యోగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో మీరు కలలుగన్న

హైదరాబాద్: ఏ ఉద్యోగం చేయాలన్నా సరైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. కానీ ఈ రోజుల్లో ఉద్యోగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో మీరు కలలుగన్న ఉద్యోగాన్ని పొందలేరు. జాబ్ మార్కెట్లో ముందుకు సాగాలంటే సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పరస్పర సహకారం, వ్యాపార మర్యాదలు, ఆర్థిక & డిజిటల్ అక్షరాస్యత లాంటి ఉపాధి నైపుణ్యాలు చాలా ముఖ్యం. యువ నిపుణులకు ఈ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) iON కెరీర్ ఎడ్జ్.. యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నది.
ఈ ప్రోగ్రామ్ రెండు వారాలపాటు కొనసాగుతుంది. దరఖాస్తుదారులు వారంలో 7 నుంచి 10 గంటలపాటు గడిపే అవకాశం ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లతోపాటు ఫ్రెషర్స్ కూడా ఈ యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ముందస్తు సన్నద్ధత అవసరం లేదు. కెరీర్ కోసం సన్నద్ధం చేసే ఈ 15 రోజుల కోర్సు పూర్తిగా ఉచితం.
నేటి యువతలో భవిష్యత్తు అవసరాలకు కావాల్సిన ప్రధాన ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. అకౌంటింగ్, IT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కీలకమైన బిహేవియరల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫౌండేషనల్ స్కిల్స్‌ను ఈ యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కవర్ చేస్తుంది. TCS iON కెరీర్ ఎడ్జ్ – యంగ్ ప్రొఫెషనల్‌లో 14 మాడ్యూల్‌లు ఉంటాయి. ప్రతి మాడ్యూల్లో 1-2 గంటల వ్యవధిలో వీడియోలు, ప్రెజెంటేషన్లు, రీడింగ్ మెటీరియల్, TCS నిపుణులు రికార్డ్ చేసిన వెబినార్లు ఉంటాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

