ముంబై: కోల్‌కతాతో సోమవారం జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో రాజస్థాన్ రాయల్స్ సర్ప్రైజ్ విక్టరీ కొట్టింది. 218 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా ఓ దశలో గెలుపు దిశగా వెళ్లింది. అయితే 17వ ఓవర్లో స్పిన్నర్ చాహల్ మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ తీసిన చాహల్ మొత్తం తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. ఆ ఓవర్ తొలి బంతికి వెంకటేశ్ అయ్యర్ (6) స్టంపౌట్ కాగా.. నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదో బంతికి శివమ్ మావి (0) భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి కమిన్స్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న చాహల్.. కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఏడు పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమి పాలైంది.
Chahal five wicket haul 🔥🔥😱😱❤️ #RRvKKR #chahal #IPL2022 #RajasthanRoyals #TATAIPL pic.twitter.com/Ph0aPXwfNW
— ᎪᎷᏆͲ ᏦႮᎷᎪᎡ (@AmitKum50993580) April 18, 2022