పాత కక్షలతో.. పందులను హతమార్చాడు

మెదక్ : పాత కక్షలు మనసులో పెట్టుకుని విద్యుత్ షాక్తో 5 పందులను హతమార్చిన సంఘటన నర్సాపూర్ రూరల్ మండలం మూసాపేట్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మూసాపేట్ గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ కర్నూలు ప్రాంతం నుంచి 30 పందులను తీసుకువచ్చి పెంచుతూ..జీవనోపాధి పొందుతున్నాడు.
ప్రతిరోజు సంగారెడ్డి ప్రాంతం నుంచి అన్నం తీసుకువచ్చి వాటికి వేస్తూ సాకుతున్నాడు. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన తలారి శేఖర్ అనే వ్యక్తి పాత కక్షలను మనసులో పెట్టుకొని తనఇంటి ఆవరణంలో పందులను హతమార్చడానికి విద్యుత్ షాక్ ను ఏర్పాటు చేశాడు.
అటువైపుగా వచ్చిన ఐదు పందులు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితులు ఎరుకలి అశోక్ చనిపోయిన పందులను తీసుకెళ్లి వాటి మృతికి కారకుడైన తలారి శేఖర్ ఇంటి పక్కన గల పొలంలో వేసి నిరసన తెలిపాడు. గ్రామస్తులు, చిన్న పిల్లలు విద్యుత్ షాక్ తగిలి చనిపోతే పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

