అది అవుట్ ఎలా ఇస్తారు.. విండీస్, లంక మ్యాచ్‌పై రచ్చ.. వీడియో

ఆంటిగ్వా: శ్రీలంక, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వివాదం నెలకొన్నది. లంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలకను మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఫీల్డింగ్‌ను అడ్డుకున్నాడన్న కారణంగా గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం అతడు కావాలని ఆ పని చేయలేదని స్పష్టంగా కనిపించింది. పొలార్డ్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన గుణతిలక.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న నిసంక పరుగు కోసం ప్రయత్నించగా వద్దని వారించాడు. ఈ ప్రయత్నంలో అతడు అనుకోకుండా బాల్‌కు అడ్డుగా వెళ్లాడు. అయితే అతడు కావాలనే ఆ పని చేసినట్లుగా భావించిన పొలార్డ్.. అంపైర్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ జో విల్సన్ సాఫ్ట్ సిగ్నల్‌గా అవుటని ప్రకటించి మూడో అంపైర్ నిగెల్ గుగైడ్ని అడిగాడు. వీడియోను వివిధ కోణాల్లో పరిశీలించిన మూడో అంపైర్.. గుణతిలకను అవుట్‌గా ప్రకటించాడు.
ఈ నిర్ణయం లంక టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్స్‌మన్ కావాలని అడ్డుకున్నట్లుగా వీడియోలో స్పష్టమైన ఆధారాలేవీ కనపించకపోయినా మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించడం వివాదానికి కారణమైంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం.. కావాలని ఫీల్డింగ్‌ను అడ్డుకుంటేనే అవుట్‌గా ప్రకటించాలి. అయితే ఈ నిర్ణయంపై శ్రీలంక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్ తర్వాత గుణతిలకను కలిసిన పొలార్డ్ ఈ వివాదాన్ని కాస్త సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

