తునీషా కేసు.. షీజాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
tunisha sharma | సీరియల్ నటి తునీషా శర్మ కేసులో సహనటుడు షీజన్ ఖాన్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 24న ‘అలీబాబా : దస్తాన్ ఏ కాబుల్’ సెట్లో తునీషా శవమై కనిపించింది. ఆమె తల్లి వనితా శర్మ ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల మేరకు అదే రోజున పోలీసులు తునీషా మాజీ ప్రియుడు షీజన్ ఖాన్‌ను
tunisha sharma case | సీరియల్ నటి తునీషా శర్మ కేసులో సహనటుడు షీజన్ ఖాన్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 24న ‘అలీబాబా : దస్తాన్ ఏ కాబుల్’ సెట్లో తునీషా శవమై కనిపించింది. ఆమె తల్లి వనితా శర్మ ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల మేరకు అదే రోజున పోలీసులు తునీషా మాజీ ప్రియుడు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కోర్టులో షీజన్ బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. ఇంతకు ముందు సైతం కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా తునీషా తల్లి వనితా శర్మ వాంగ్మూలాన్ని, ఎఫ్ఐఆర్ కాపీని షీజన్ తరపు న్యాయవాది శైలేంద్ర మిశ్రా శుక్రవారం కోర్టుకు చదివి వినిపించారు. తునీషాకు తరచూ ఆందోళనలు ఉండేవని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సీపీఐ సెక్షన్ 306ని ఉపయోగించలేమని, ఎందుకంటే షీజన్ మృతురాలిని ఏ విధంగానూ ప్రేరేపించలేదని లేదా ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితులు సృష్టించలేదని కోర్టుకు తెలిపారు. షీజన్, తునీషాల బ్రేకప్ డిసెంబర్ 15న జరిగిందని, ఆ తర్వాత ఇద్దరి జీవితం మామూలుగానే సాగిందన్నారు. 15 -24 మధ్య ఇద్దరి మధ్య సాధారణ ప్రవర్తన ఉందని, ఈ సమయంలో సెట్లో అసాధారణంగా ఏమీ జరుగలేదని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

