SunRisers Hyderabad | సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్
SunRisers Hyderabad | 2024 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ డానియల్ వెటోరీ నియమితులయ్యాడు.
SunRisers Hyderabad | 2024 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ డానియల్ వెటోరీ నియమితులయ్యాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బ్రియాన్ లారా ఉండగా.. అయన స్థానంలో వెటోరీ వచ్చారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా వెటోరీ గతంలో 2014 నుండి 2018 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ప్రధాన కోచ్‌గా పని చేశారు. 2019లో బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కాన్సల్టెంట్గా చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఇక కివీస్ జట్టు తరపున ఆల్రౌండరీ వెటోరీ 113 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు.
🚨Announcement🚨
Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡
Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన హైదరాబాద్.. పాయింట్స్ టేబుల్లో చిట్టచివరి స్థానంలో నిలిచి అభిమానులను నిరాశపరిచింది. ఇక డానియల్ వెటోరీ రాకతో అయిన 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దశ మారుతుందేమో చూడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

