రాతి యుగం నగలు నయా ట్రెండ్
నగల్లో రాళ్లు పొదగడం తెలిసిందే. కానీ, ముందే ఓ పెద్దరాయి తీసుకుని.. దాని ఆధారంగా ఆభరణాన్ని డిజైన్ చేయడం నయా ట్రెండ్. ఇందులో పెండెంట్లు, ఉంగరాలు, దుద్దులు.. ఇలా నగలన్నీ పెద్ద పెద్ద రాళ్లచుట్టే తిరుగుతాయి. ‘బిగ్స్టోన్ జువెలరీ’ అమ్మాయిల మనసులో పెద్ద చోటే సంపాదిస్తున్నాయి
నగల్లో రాళ్లు పొదగడం తెలిసిందే. కానీ, ముందే ఓ పెద్దరాయి తీసుకుని.. దాని ఆధారంగా ఆభరణాన్ని డిజైన్ చేయడం నయా ట్రెండ్. ఇందులో పెండెంట్లు, ఉంగరాలు, దుద్దులు.. ఇలా నగలన్నీ పెద్ద పెద్ద రాళ్లచుట్టే తిరుగుతాయి. ‘బిగ్స్టోన్ జువెలరీ’ అమ్మాయిల మనసులో పెద్ద చోటే సంపాదిస్తున్నాయి.
నయా ఫ్యాషన్ అన్న పదం నగలకు కుదిరినంతగా మరి దేనికీ సరిపోదేమో. ఖరీదైన బంగారు ఆభరణాలైనా, పాకెట్ ఫ్రెండ్లీ ఫ్యాన్సీ నగలైనా.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. కొత్తకొత్త డిజైన్లతో కొంగొత్త రూపాల్లో దర్శనమిస్తూనే ఉంటాయి.
చూడగానే జిగేల్మనిపించే రాళ్ల నగలుకూడా ఇప్పుడు నయా లుక్‌లో కనిపిస్తున్నాయి. నగను డిజైన్ చేశాక రాళ్లు కూర్చడం కాదు, రాయిని ఎంచుకున్నాకే నగను డిజైన్ చేస్తారిక్కడ. బంగారం విషయమే తీసుకుంటే…
పచ్చ, కెంపు, ట్యాంజనైట్లాంటి విలువైన రాళ్లను ఉపయోగిస్తున్నారు. వాటి మీద స్వర్ణాన్ని అల్లికలా రూపొందించి, చిన్నచిన్న వజ్రాలు, అమెరికన్ డైమండ్లను పొదుగుతున్నారు. ఈ తరహా ఉంగరాలు రాణీవారి అంగుళీకంలా చూడగానే ఆకట్టుకుంటాయి. దాని మీద బంగారు తాపడంతో కళ్లను కట్టిపడేసేలా అలంకరించడం డిజైనర్ల పని. ఇదే తరహాలో కాలేజీ అమ్మాయిల కోసం ఏడీ స్టోన్, రైన్ స్టోన్, కలర్డ్ మార్బుల్, రెజిన్.. ఇలా రకరకాల రాళ్లతో ఫ్యాన్సీ నగలు రూపొందుతున్నాయి. ఈ మాడళ్లలో ఎక్కువగా సన్నటి గొలుసుకు తగిలించుకునేలా రంగురంగుల లాకెట్లు దొరుకుతున్నాయి. వాటికి తగ్గట్టు ఉంగరాలు, జుంకాలు కూడా వస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

