అదే నిజమైన అందం
సినిమా అంటేనే గ్లామర్ తళుకులు కలబోసిన ఓ రంగులలోకం. ఇక్కడ అందంగా, ఆకర్షణీయంగా కనిపించాల్సిన అవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంటుంది.
సినిమా అంటేనే గ్లామర్ తళుకులు కలబోసిన ఓ రంగులలోకం. ఇక్కడ అందంగా, ఆకర్షణీయంగా కనిపించాల్సిన అవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా అభిమానులు సౌందర్యరాశులుగా అభివర్ణించే కథానాయికలు అందం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటారు. మేకప్ లేకుండా హీరోయిన్స్ బయటకు రావడం చాలా అరుదైన విషయంగా చెబుతారు. అయితే అగ్ర కథానాయిక శృతిహాసన్ ఇందుకు భిన్నంగా ఎలాంటి మేకప్ లేకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుస ఫొటోల్ని పోస్ట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న సోషల్‌మీడియా యుగంలో తమ అందానికి సాంకేతిక హంగులు జోడిస్తూ, అధునాతన ఫిల్టర్లను వాడుతూ మరింత ఆకర్షణీయంగా కనిపించాలని సినీ తారలు ప్రయత్నిస్తున్నారు. అందుకు భిన్నంగా శృతిహాసన్ చేసిన పోస్ట్ సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలకు తనదైన శైలి కామెంట్‌ను జోడించింది శృతిహాసన్. ‘ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ సెల్ఫీలు, ఫొటోల కోసం ప్రయత్నిస్తారు. కానీ నేను ఒరిజినల్ ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నా. జలుబు, సైనస్ వల్ల ముఖం కాస్త వాచి పోయింది. ఈ ఫోటోలు కూడా మీకు నచ్చుతాయనుకుంటా. సహజత్వంలోనే నిజమైన అందం దాగి ఉంటుంది’ అని శృతిహాసన్ పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

