సెల్ఫిష్ కుర్రాడి ప్రేమకథ
యువ హీరో ఆశిష్ నటిస్తున్న కొత్త సినిమా ‘సెల్ఫిష్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్రంతో విశాల్ కాశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కోలీవుడ్ హీరో ధనుష్ క్లాప్ ఇవ్వగా…దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తొలి షాట్‌కు దర్శకత్వం వహించి…మోషన్ పోస్టర్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్లో రిజర్వ్డ్ ఫర్ మై లవ్ అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంది. అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….‘ఆర్య’ తర్వాత సుకుమార్‌తో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు విశాల్ కాశీ చెప్పిన సెల్ఫిష్ అనే కాన్సెప్ట్ నచ్చింది. ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో ఆశిష్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా అతనికి సవాలు లాంటిది. చిత్రబృందం అందరికీ శుభాకాంక్షలు’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:మణికందన్ ఎస్, సంగీతం : మిక్కీ జే మేయర్, ఆర్ట్ : యల్లయ్య, సాహిత్యం: చంద్రబోస్, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, నిర్మాతలు : రాజు, శిరీష్, రచన దర్శకత్వం : విశాల్ కాశీ.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Dil raju
- Hero Ashish
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

