పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి రక్షించండి.. ఒక వ్యక్తి వినూత్నంగా ప్రచారం

లండన్: పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి తనను రక్షించాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఏకంగా రహదారుల పక్కగా ఏర్పాటు చేసే బోర్డులపై వాణిజ్య ప్రకటనలు కూడా ఇచ్చాడు. అంతేగాక తనకు నచ్చిన అమ్మాయిని అన్వేషించే ప్రయత్నంలో కూడా అతడు ఉన్నాడు. దీని కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందించాడు. ఈ అరుదైన ఘటన బ్రిటన్లో జరిగింది. లండన్కు చెందిన చెందిన 29 ఏండ్ల వ్యాపారవేత్త మహమ్మద్ మాలిక్ తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం బర్మింగ్హామ్ నగరంతోపాటు మాంచెస్టర్లో అడ్వర్టైజింగ్ హోర్డింగ్లపై జనవరి 1న వాణిజ్య ప్రకటనలు ఇచ్చాడు. ‘పెద్దలు కుదిర్చిన పెండ్లి నుంచి నన్ను కాపాడండి’ అని అందులో పేర్కొన్నాడు. నవ్వుతున్న అతడి ఫొటోతో ఉన్న ఈ యాడ్లో ‘Findmalikawife.com’ అనే వెబ్సైట్ కూడా ఉన్నది.
కాగా, లండన్కు చెందిన మాలిక్, బర్మింగ్హామ్ను తన రెండవ నివాసంగా భావిస్తున్నాడు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహాలకు తాను వ్యతిరేకం కాదన్నాడు. ముందుగా జీవిత భాగస్వామిని స్వయంగా కనుగోనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు సరైన అమ్మాయి తనకు తారసపడలేదని, అందుకే ఇలా హోర్డింగ్లపై ప్రకటనలు ఇచ్చినట్లు తన వెబ్సైట్లో పేర్కొన్నాడు.
మరోవైపు తనకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో అన్నది కూడా మాలిక్ వెల్లడించాడు. ‘నా ఆదర్శ భాగస్వామి 20 ఏండ్ల వయస్సులో ఉన్న ముస్లిం యువతి అయ్యి ఉండాలి. డిగ్రీ చదువుతూ ఉండాలి’ అని తెలిపాడు. పాకిస్థాన్లోని పంజాబీ కుటుంబానికి చెందిన తనకు జాతి పట్టింపు లేదని వెబ్సైట్లో పేర్కొన్నాడు.
కాగా, శనివారం ఈ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు వందలాది సందేశాలు తనకు వచ్చాయని మాలిక్ తెలిపాడు. అయితే సమయం లేక వాటిని ఇంకా చూడలేదని చెప్పాడు. దీని కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉందని, అయితే ఎప్పుడు అన్నది ఇంకా ఆలోచించలేదని బీబీసీతో అన్నాడు.
తాను ముందుగా డేటింగ్ యాప్లు, కొన్ని డేటింగ్ ఈవెంట్లను కూడా ప్రయత్నించినట్లు మాలిక్ తెలిపాడు. ఒక స్నేహితుడి సలహాతో ఇలా తనకు తానే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. ఈ ప్రకటనల బోర్డులు జనవరి 14 వరకు కొనసాగుతాయని వెల్లడించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

