హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నది. గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అప్డేట్ ఇచ్చింది. కెనడాలో రెండు వారాల క్రితం ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలో తన మోచేతికి గాయమైనట్లు ఆమె వెల్లడించింది. అయితే స్కానింగ్‌కు వెళ్లిన తర్వాత కానీ ఆ గాయం తీవ్రత తెలియలేదని ఆమె తెలిపింది. కొన్ని వారాల పాటు ఆటకు దూరం కానున్నాని, యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పింది. గాయం వల్ల తన రిటైర్మెంట్ ప్రణాళికలు కూడా మారే అవకాశం ఉన్నట్లు సానియా పేర్కొన్నది.