టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలో ఉన్న ప్రత్యేక టాలెంట్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలోనైన ఇట్టే ఇమిడిపోయి ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తూ ఉంటుంది. ఇక డ్యాన్స్ పరంగాను సమంతకి తిరుగులేదు. అద్భుతమైన స్టెప్పులు వేస్తూ అలరిస్తుంటుంది. తాజాజాగా బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన సమంత ఎడుఆర్డో లుజ్క్వినోస్ డోంట్ రష్ సాంగ్‌కు అద్భుతమైన స్టెప్పులు వేసింది.
బెల్లీ మూవ్మెంట్స్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సమంత డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ సమ్మర్లో విడుదల కానుండగా, ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుంది. ఇందులో శకుంతలగా కనిపించి అలరించనుంది.