మాడ్రిడ్: చాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) మాంచెస్టర్ సిటీతో జరిగిన రెండో దశ సెమీస్ మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 3-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓవరాల్‌గా రెండు సెమీస్ మ్యాచ్‌లు కలిపి మాడ్రిడ్ జట్టు 6-5 తేడాతో సిటీపై ఆధిక్యంతో టైటిల్ పోరులో నిలిచింది. ఈనెల 29న జరిగే చాంపియన్స్ లీగ్ ఫైనల్లో లివర్‌పూల్‌తో రియల్ మాడ్రిడ్ తలపడుతుంది. మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున రోడ్రిగో(90ని, 90+ని) డబుల్ గోల్స్‌తో విజృంభించగా, కరీమ్ బెంజెమా(95ని) మరో గోల్ చేశాడు. సిటీ తరఫున రియాద్ మహ్రెజ్(73ని) ఏకైక గోల్ చేశాడు.